10-07-2025 12:00:00 AM
అనుమతి లేకున్నా పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
మహబూబ్ నగర్ జూలై 9 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ రోజురోజుకు అంచల అంచలుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. అభివృద్ధి ని వేగంగా పరుగులు పెట్టిస్తున్న ప్రతినిధులు ఆదిశగానే జనం సై తం పట్టణ విస్తరణకు తోడ్పాటును అంది స్తూ వివిధ ప్లాట్లను కొనుగోలు చేయడంతో పాటు జనాభా నివాస ఆవాసాలను ఏర్పా టు చేసుకుంటూ పట్టణ ఎదుగుదలకు తో డ్పడుతున్నారు.
ఈ విషయం అందరికీ శుభ సూచకం అయినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్నిపై కూడా సంబంధిత అధికార యంత్రంగం అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలోనే పట్ట ణంలోని రోడ్డు ప్రధాన రోడ్ల మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు మొక్కల ను సైతం ఉంచారు. పట్టణ రోడ్లపై వెళ్తున్న క్రమంలో ప్రయాణికులకు ప్రశాంతత, గ్రీన రీ అందుబాటులో ఉంచితే బాగుంటుందని మున్సిపల్ అధికారులు ప్రత్యేక నిఘా ఉం చారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇటీవల ఉన్నట్టుండి పట్టణంలోని ప్రధాన రోడ్ల మధ్యలో లాలీపాప్ అనుమతులు లేకుండా బోర్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ శా ఖ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అనుమతులు లేకుండానే ఈ ప్రచార బోర్డులను ఏర్పాటు చేసి పోగు చేసుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. లాలీపాప్ ప్రచార కోట్లు పట్టణంలోని ప్రధాన రోడ్లపై మధ్యలో ఏర్పాటు చేసినప్పటికీ అనుమతులు మాత్రం ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.
-అనుమతి ఉన్న లేకున్నా....
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ ప్రాంతం పైన కాస్త వినియోగించుకోవాలనుకున్నప్పటికీ ప్రభుత్వ అనుమతులు కచ్చితంగా తీసు కోవాల్సి ఉంటుంది. కమర్షియల్ ప్రాంతం లో ప్రచార బోర్డులు ఏర్పాటు చేసుకొని అనుమతులు తీసుకోకపోయినప్పటికీ అధికార యంత్రంగం ఎందుకు మౌనంగా ఉం దో అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని సమకూర్చడంలో అధికారులు.
ఈ రకంగా వ్యవహరించవలసి ఉన్నప్పటికీ ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసు కొ ని ముందస్తుగా ఎమ్మెల్యే సంబంధిత ఫో టోలు పెడుతూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి కాలక్రమ కమర్షియల్ గా వినియోగించుకునేలా ప్రచార బోర్డులు ఏర్పాటు చేసిన వ్యక్తులు అడుగులు వేస్తున్నారు. ఇకనైనా అధికార యంత్రంగం స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
-ప్రచారం బోర్డులు ఓకే.. పర్మిషన్..?
పట్టణలో ప్రచార లాలిపాప్‌లో ఏర్పాటు చేసిన సంబంధిత అధికార యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా సంబంధిత ఏర్పాటు చేసిన సంస్థలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లే దు.
దాదాపు 50 వేల గృహాలు ఉన్న పట్టణంలో ప్రచారానికి కూడా వివిధ వ్యాపార సముదాయాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే అదునుగా చేసుకొని కొంద రు ప్రచార బోర్డులు ఏర్పాటు చేసి వ్యాపార సంస్థల నుంచి ప్రచార సమాచారాన్ని సేకరించి బోర్డులపై ఉంచి పోవు చేసుకు నేందు కు తమ యత్నాలను ముమ్మరం చేస్తున్నా రు.
ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోయినాప్పటికీ ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తున్న సంబంధిత అధికార యంత్రంగా మాత్రం అస్సలు పట్టించుకోవడంలేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి.
మొక్కలు ఉన్న ప్రాంతం లో మొక్కలను తొలగించి ప్రజాపుర్లు ఏర్పా టు చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మ కు మీరెత్తన్నట్లు వ్యవహరించడం ఏంటని పట్టణవాసులు విమర్శిస్తున్నారు.
అనుమతులు ఇవ్వలేదు...
పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఏర్పాటు చేసిన లాలిపాప్ ప్రచార బోర్డులకు సం బంధించి గత ఏడాదిలో ఒక సంస్థ డబ్బులు చెల్లించడం జరిగింది. ఈ ఏడ ది అనుమతి ఇవ్వలేదు. పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకొని చెబుతాను. ని బంధనల మేరకు ముందుకు సాగేలా ప్రతి విషయంలోనూ చర్యలు తీసుకుం టాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదా యం వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రవీణ్ కుమార్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్ నగర్