10-07-2025 01:01:07 AM
కరీంనగర్, జులై9(విజయక్రాంతి): కరీంనగర్ తీగల వంతెన సమీపంలో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి బుధవారం పరిశీలించారు.16.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి.
పనులను పర్యవేక్షించిన కలెక్టర్ మిగతా పనులను త్వరిత గతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. భవనంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలు సమకూర్చాల ని మున్సిపల్‌ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డిఓ మహేశ్వర్,మున్సిపల్ డివిజనల్‌ఇంజనీర్లు లచ్చిరెడ్డి, అయూబ్‌ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరిపాల్గొన్నారు.