calender_icon.png 1 August, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఆందోళనపై కలెక్టర్ స్పందన

01-08-2025 12:30:04 AM

  1. డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్లను సస్పెండ్
  2. ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్మాస్టర్లకు మెమో జారీ
  3. సమస్యల పరిష్కారానికి అధికారులకు కఠిన ఆదేశాలు
  4. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ
  5. కలెక్టర్ బీఎం సంతోష్

అలంపూర్, జూలై 31 : విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకున్నామని, భ విష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్య లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉండవల్లి మండలం అలం పూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బి.సి. బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతపై రోడ్డెక్కి ఆందోళనకు దిగిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ పాఠశాలను స్వయంగా సందర్శించి,

ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్య లను విని, పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యను చట్టబద్ధంగా సంబంధిత అధికారులకు తెలియజేయా లని, మీ భద్రత మాకు అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నామని, రోడ్డెక్కే ప్రయత్నాలు ప్రమాదాలకు దారితీయే అవ కాశముండటంతో అలాంటి పరిస్థితి మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని అన్నారు.

పాఠశాలలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్, వార్డెన్, హౌ స్మాస్టర్లపై మెమో జారీ చేసినట్లు తెలిపారు.విద్యార్థులపై బెదిరింపులకు పెడుతున్న పాఠశాల భవన యజమానిపై ఎఫ్‌ఐ ఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నాలు గు మరుగుదొడ్లను ఉపయోగించుకొనాలని, నెల రోజులలో అందరికీ సరిపడేలా కొత్త మరుగుదొడ్లు, బాత్రూంలను ని ర్మించి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం న్యాయమైన పౌష్టికా హారం తప్పనిసరిగా అందించాలన్నారు. నాణ్యతలేని బియ్యాన్ని వెంటనే తిరిగి పంపి మంచి బియ్యాన్ని తెప్పించుకోవాలని, దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాలలో ఆర్.ఓ. ప్లాంట్ పనిచేయడం లేనందున తాగడానికి వెంటనే మినరల్ వాటర్ అందించాలని ఆదేశించారు.

విద్యార్థుల పట్ల నిత్యం బాధ్యతతో ఉండాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్య వహరించరాదని, విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భద్రత విషయంలో పూర్తి నిఘా పెట్టాలని తేల్చి చెప్పారు. కస్తూర్బా గాం ధీ బాలికల విద్యాలయము ఆకస్మిక తనిఖీ ఉండవల్లి మం డలం కాలుగొట్ల గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల వి ద్యాలయం ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఇటీవల ఒక వి ద్యార్థినికి పాము కాటుతో అనుమానంతో ఆసుపత్రికి తరలించిన ఘటనపై ఆమెతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థుల ఆరోగ్యం అత్యం త ప్రాధాన్యత గల అంశం కావడంతో, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి, పాములు మరియు హానికర కీటకాలు దూరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.పాఠశాల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని స్పష్టంగా పేర్కొన్నా రు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం ప్రతిరోజూ అం దించాలని ఆదేశించారు.

పాఠశాల రిజి స్టర్లను తనిఖీ చేసి,ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం పూర్తిగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ అనీల, ప్రధానోపాధ్యాయులు రామ కృష్ణ, కేజీవీవీ ప్రిన్సిపాల్ పరిమళ,సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, వార్డెన్ రేణుక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.