calender_icon.png 22 September, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారే..మళ్లీ రావాలంటూ స్టెప్పులు వేసిన కళాశాల విద్యార్థులు

22-09-2025 12:21:13 AM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలతో వివాదాస్పదంగా తాడూరు కళాశాల విద్యార్థులు డిజె స్టెప్పులు.  

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 21 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మం డల కేంద్రంలోని కూచుకుళ్ళ సౌభాగ్య ప్రభు త్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అ ధ్యాపకులు వివాదాస్పదమైన డీజే పాటలతో స్టెప్పులు వేశారు. ఆదివారం ఫ్రెషర్స్ డే జరుపుకోవాలని అందరూ ఉత్సాహంగా డీజే స్టెప్పులతో చిందులు వేశారు.

కానీ బిఆర్‌ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి చెందగా తిరిగి సారే మళ్లీ రా వాలి అనే డిజె పాటలతో విద్యార్థులు అధ్యాపకులు స్టెప్పులు వేయడం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఒక పార్టీకి చెందిన వ్యక్తికి సంబంధించిన పాటలతో డాన్సులు వేయడం పట్ల అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణను వివరణ కోరగా కార్యక్రమం ముగిసిన అనంతరం అనుకోకుండా వచ్చిన పాట అయ్యుంటుందనికొట్టిపరేసారు.