02-11-2025 12:58:47 AM
ఆదివారంలోగా రూ. 900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి
10న లేదా 11న పది లక్షల మందితో నిరసన కార్యక్రమం
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం
ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నేతలు వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) ఉద్యమ కార్యాచ రణను ప్రకటించింది. ఈ నెల 2లోగా బకాయిలు చెల్లించకుంటే, 3 నుంచి నిరవధిక కాలేజీల బంద్‌ను పాటించనున్నట్లు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేశ్, వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు.
శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఉద్యమ కార్యాచరణను ప్రక టించారు. కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే తమపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా? అని ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. ఆదివారంలోగా టో కెన్ సోమ్ము రూ.1200 కోట్లలో రూ. 300 కోట్లు పోను మిగిలిన రూ.900 కో ట్లను ప్రభుత్వం చెల్లించకపోతే రేపటినుం చి రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కాలేజీల బంద్ జరుగుతుందన్నారు.
అన్ని పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్రంలోని యూనివర్సిటీలను కోరుతున్నట్లు వారు తెలిపారు. 6న 1.50 లక్షల మంది కళాశాలల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాల అనంతరం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించడంతోపాటు జిల్లా కలెక్టరేట్‌లను సైతం ముట్టడిస్తామని తెలిపారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి...
ఇప్పటివరకు ఇవ్వాల్సిన రూ.10వేల కోట్ల పెండింగ్ బకాయిల్లో తక్షణం రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని, మిగిలిన రూ.5 వేల కోట్లు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని, బంద్‌కు వెళ్లాలనే భావి స్తున్నట్లుగా కనబడుతుందన్నారు. వడ్డీలకు తెచ్చి కాలేజీలను నిర్వహిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2500 కాలేజీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు.
ప్రైవేట్ కాలేజీలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్ మెయిల్ చేయడమే అన్నారు. ఫీజు రీయింర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు బాధ్యతలు ఎమ్మెల్యేలు తీసుకోవాలని కోరారు. విద్యర్థుల నిరసనలతో గతంలో ఎన్నో ప్రభుత్వా లే పడిపోయాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కళాశాలల యాజమాన్యాలను బెదిరింపులతో భయపెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని వారు కోరారు.