02-11-2025 12:51:09 AM
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో రేవంతుద్దీన్ పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నా రు. దేశ గౌరవం, సైనికుల త్యాగాలు, జాతీయ భద్రత వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బా ధాకరమన్నారు. కాంగ్రెస్ 23 నెలల పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేసింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడా రు. సీఎం రేవంత్ రెడ్డి సైనికులను అవమానపరిచే విధంగా మాట్లాడారని, ఆపరేషన్ సింధూర్‌లో సైనికుల పోరాటం మర్చిపోయినట్టున్నారని సీఎంపై ఆయన మండిపడ్డారు. సీఎం చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఈ వ్యాఖ్య లను తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
పహల్గాం ఘటన లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు అండగా నిలిచేలా, వారిని ఆదుకునేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ఇలాంటి విషాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరైంది కాద ని హితవు పలికారు. పాకిస్తాన్...భారత్‌పై దాడి చేసిందని రేవంతుద్దీన్ ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. రేవంతుద్దీన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు.
బ్లాక్‌మెయిల్ రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వ ర్ రెడ్డి మండిపడ్డారు. తమకు ఓటు వేయకుంటే పింఛన్లు, 25 వేల రేషన్ కార్డులు కట్ చేస్తామని, ఉచిత బియ్యం రావని ప్రజలను బెదిరిస్తూ మాట్లాడటంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...బీఆర్‌ఎస్ హయాంలో సీతారాంపూర్ సీతారాముల స్వామి దేవాలయానికి చెందిన 1100 ఎకరాల ఎండోమెంట్ భూమిని నోటిఫై చేసి వ్యాపారులకు అమ్మేసిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఎండోమెంట్‌కే కేటాయించాలని కోరారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... జీవో నెం.111 రద్దు పేరుతో రూ. లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ ఎంపీ గోడెం నగేష్, రాష్ట్ర నాయకులు గౌతం రావు, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ 23నెలల పాలన.. భస్మాసుర హస్తం
కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారిందని రాంచందర్‌రావు మండిపడ్డారు. మోసపూరితమైన మాటలతో ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయని, కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ న్యాయం చేయలేదని, ఏ మొహంతో వెళ్లి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, పేషెంట్లకు హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందడంలేదన్నారు. రైతులకు “రుణమాఫీ” చేస్తామని చెప్పి, చివరికి ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాఫీ చేయాలా అని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.