02-11-2025 12:19:34 AM
నల్గొండ రూరల్, నవంబర్ 1: నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు మిల్లర్ల వద్ద మంత్రుల లంచాల రూపంలో వందల కోట్లు దండుకున్నారని, కమీషన్ల మీదనే మంత్రుల దృష్టి ఉన్నది తప్పా రైతుల మీద లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి పీఏసిఎస్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మాట్లాడారు.
జిల్లాలో రైతులు పుట్టెడు దుఃఖంలో విలవిలలాడుతుంటే జిల్లా మంత్రులకు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం చేతకాని తనం ఓ వైపు, ప్రకృతి ప్రకో పం ఓ వైపు ఉండటంతో అన్నదాతలు ఆగమయ్యారని చెప్పారు. నల్లగొండ జిల్లా మంత్రులు కమీషన్లు, సంపదన మీదనే దృష్టి సారించారని, విదేశీ టూర్లలో జల్సా లు చేస్తున్నారని, దోచుకోవడం మీదనే వారి దృష్టి అని ఆరోపించారు. రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి వారికి సాగిలపడ్డారని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడంతో ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతున్నదని, పత్తి రైతుల పరిస్థితి మరీ దారు ణంగా ఉన్నదని వాపోయారు. తుఫాన్‌తో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం వెం టనే అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు.
ఆయన వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్ట మల్లికార్జునరెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మా జీ జడ్పీటీసీలు తండు సైదులు గౌడ్, తుమ్మ ల లింగస్వామి, మాజీ ఎంపీపీ బొజ్జ వెంక న్న, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి, మారగొని గణేష్, పెరిక యాదయ్య, రామ్‌రెడ్డి, బీపంగి కిరణ్, రాపోలు వెంకటేశ్వర్లు, కొమ్ముగిరి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.