13-05-2025 04:57:21 PM
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్ట్రాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిప్టీ 24,600 స్థాయి దిగువకు చేరింది. 82,249.60 పాయింట్ల నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 1281 పాయింట్ల నష్టంతో 81,148 వద్ద ముగిసింది. నిఫ్టీ 346.35 పాయింట్ల నష్టంతో 24,578.35 వద్ద స్థిరపడింది. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ 85.33గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మాహీంద్రా షేర్లు మాత్రమే లాబాల్లో ముగియగా.. మిగిలిన ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్ హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి షేర్లలో అమ్మకాల సూచీలను పడేశాయి.