16-08-2025 12:10:57 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): డౌన్ పేమెంట్ కట్టి నెలనెలా ఈ ఎంఐలతో స్వంత కారు కొనుక్కున్నా చాలా మంది హైవేలలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు కాస్త తటపటాయిస్తారు. పెరిగి పోయిన ఇంధన ధరలకు తోడు విచ్చలవిడిగా వెలసిన టోల్‌ప్లాజాలు దాటాలంటే ఫా స్టాగ్‌లో ఉన్న బ్యాలెన్స్ కరిగిపోతుండటంతో వాహనదారులు హడలిపోయే పరిస్థితి ఉం డేది. ప్రస్తుతం తెలంగాణలో సగటు టోల్‌ప్లాజా ఛార్జీ రూ. 80 ఉంటుంది.
ఉదా హరణకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాల్సి వస్తే 8 టోల్ ప్లాజాలు దాటాల్సి వస్తుంది. ఇందుకు ఒకవైపు సుమారు రూ. 800 వరకు ఛార్జి పడుతుంది. అప్ అండ్ డౌన్ లెక్కిస్తే ఖర్చు రూ. 1,600 అవుతుంది. టోల్ ఖర్చులు పెరిగిపోయి కార్లు టోల్ రోడ్లపైకి ఎక్కించేందుకు భయపడుతున్న తరు ణంలో కేంద్రం స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా తీసుకువచ్చిన వార్షిక ఫాస్టాగ్ ప్లాన్ వాహనదారులకు శుభవార్త అందిస్తోంది.
రూ. 3వేలతో రీఛార్జి చేసుకుంటే ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు టోల్‌గేట్ దాటేందుకు అవకాశం లభిస్తుంది. తెలంగాణలో సగటు టోల్ ఛార్జీతో పోలిస్తే చాలా తక్కువగా రూ. 15 ఖర్చుతో టోల్ దాటేసే అవకాశం లభిస్తుంది. ఒకసారి రీఛార్జి చేసుకుని ఏడాది పాటు ఎలాంటి చీకూచింత లేకుండా ప్రయాణం చేసేందుకు అవకాశం ఏర్పడింది.
ఏడాది పాటు హాయిగా
నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేల మీద జర్నీ చేసే నాన్ కమర్షియల్ వెహికిల్స్ కోసం కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఈ వార్షిక టోల్ పాస్ తీసుకొచ్చింది. రూ.3 వేలతో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు ఈ పాస్ ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. ఫలితంగా వాహనదారులు పదేపదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఏడాదిపాటు వ్యాలిడిటీ ఉండే ఈ పాస్‌ను కేవలం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే ఇస్తారు. ఎల్లో ప్లేట్ ఉండే ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఇది వర్తించదు. కార్లు, వ్యాన్లు, జీపులు వంటి వ్యక్తిగత వాహనాలకు మాత్రమే అవకాశం ఇచ్చారు.
ఈ పాస్‌ను రూ.3 వేలతో రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పుల వరకు పనిచేస్తుంది. లేదంటే ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఏడాది లోపే 200 ట్రిప్పులు అయిపోతే మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా లెక్కిస్తారు
ట్రిప్ అంటే సాధారణ వాడుకలో వెళ్లిరావడాన్ని ఒక ట్రిప్పుగా భావిస్తారు. కానీ టోల్ ట్రిప్ లెక్క వేరే ఉంటుంది. మీరు ఒక టోల్ గేట్‌ను దాటితే అదొక ట్రిప్పుగా లెక్కిస్తారు. అంటే ఉదాహరణకు హైదరాబాద్ హైవే నుంచి బెంగళూరుకు కారులో వెళ్లాల్సి వస్తే 8 టోల్‌గేట్లు దాటాలి. అంటే ఆ కారు 8 ట్రిప్పులు దాటిందని అర్థం. మళ్లీ రిటర్న్ జర్నీకి మరో 8 ట్రిప్పులుగా లెక్కిస్తారు.
ఇప్పుడున్న విధానం ప్రకారం సాధారణంగా ఒక టోల్‌గేట్ దగ్గర కనీసం రూ.80 చెల్లిస్తే 200 టోల్ గేట్లు క్రాస్ చేయడానికి రూ.16 వేలు చెల్లించాలి. కానీ వార్షిక పాస్ తీసుకుంటే రూ.3 వేలతోనే సరిపోతుంది. తద్వారా ఏడాదికి సగటున రూ.10వేల పైగానే మిగులుతుందని భావించవచ్చు.
అప్పుడో ఇప్పుడో కారు తీసే వారికి
ఏడాదికి 200 సార్లు టోల్ దాటే వారికి కొత్త ప్లాన్ చాలా అత్భుతం. కానీ అప్పుడో ఇప్పుడో కారు బయటకు తీసే వారికి ఈ విధానం పెద్దగా లాభదాయకం కాకపోవ చ్చు. మహా అయితే నేను ఏడాదికి 20సార్లు మాత్రమే టోల్ దాటుతా... అలాంటప్పుడు నాకు ఈ రూ. 3వేల పాస్‌తో నష్టం కదా అనుకునే వారికి పాత విధానంలో కొనసాగేందుకు అవకాశం కల్పిస్తోంది.
కొత్త విధానంలోకి మారండిలా
ఈ వార్షిక టోల్ ప్లాజా పాస్ విధానంలోకి మారేందుకు మోర్త్ ఓ లింక్‌ను తీసుకువచ్చింది. దీన్ని రాజమార్గ్ యాత్ర (Rajmargyatra app) ద్వారా పొందొ చ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్స్ యాపిల్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ లింక్ ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంది. వెహికిల్ నంబర్, మొబైల్ నంబర్, ఫాస్టాగ్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి రూ.3వేలు చెల్లిస్తే సరిపోతుంది. 2 గంటల్లో వన్ ఇయర్ పాస్ యాక్టివేట్ అవుతుంది.
ఎప్పటి లాగే వడ్డింపులు తప్పవు
లిస్ట్ ఆఫ్ ఎలిజబిల్ టోల్‌ప్లాజాస్ పేరిట రాజమార్గ్ మొబైల్ యాప్‌లో కేంద్రం వార్షి క పాస్ ద్వారా ప్రయాణించే టోల్ ప్లాజాల వివరాలను అందించింది. ఇందులో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వివరాలు కనిపించడం లేదు. అంటే ఓఆర్‌ఆర్ టోల్ దాటేందుకు అదనంగా చెల్లింపులు చేయా ల్సి ఉంటుందని తెలుస్తోంది. అప్పటికే ఉన్న ఫాస్టాగ్‌లో రెగ్యులర్‌గా రీఛార్జీ చేసుకున్నట్లే ఇప్పుడు కూడా అదనంగా రీఛార్జి చేసుకుని ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించాల్సి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తెలిపాయి.
అంటే వార్షిక ప్లాన్ కేవలం నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్‌ప్రెస్ హైవేస్‌పై మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఉండే ఓఆర్‌ఆర్, టీటీడీ, శ్రీశైలం, తదితర టోల్‌ప్లాజాల వద్ద ఎప్పటి లాగే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్నింటికీ ఈ పాస్ పనిచేస్తుందని భావించవద్దని రవాణా రంగ నిపుణులు అంటున్నారు.
వాహన్‌లో లేక.. వార్షిక ఫాస్టాగ్ రావట్లే
రూ.3వేల వార్షిక ఫాస్టాగ్ ఇప్పట్లో లేనట్లే
రాష్ట్రానికి సమాచారం ఇచ్చిన మోర్త్ అధికారులు
దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన వార్షిక టోల్ పాస్ ఫాస్టాగ్.. మన రాష్ట్రానికి చెందిన వాహనదారులకు ఇప్పుడే అందుబాటులోకి రావడం లేదని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి చెంది న రవాణా శాఖ ఇంకా వాహన్ పోర్టల్‌ను అమల్లోకి తీసుకురాకపోవడం వల్లే ఈ దుస్థితి కారణమని సమాచారం. ఈ మేరకు మోర్త్ అధికారులు రాష్ట్రానికి సమాచారం కూడా ఇచ్చారు.
వాహన్ పోర్టల్ మనకు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రానికి చెందిన వాహనాలకు వార్షిక ఫాస్టాగ్ ఇప్పట్లో అందుబాటులోకి రావడం లేదని అధికారులు తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త పాస్ ద్వారా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు టోల్ గేట్ల వద్ద వార్షిక ఫాస్టాగ్ పాస్ స్కీమ్ అమల్లోకి వచ్చింది.
దేశ వ్యాప్తంగా వాహన్ పోర్టల్‌లో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తిస్తున్న కొత్త పథకం మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులోకి రాకపోయినా త్వరలోనే సమస్య తీరుతుందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. వాహన్ పోర్టల్‌లోకి తెలంగాణ కూడా చేరే కసరత్తు కొనసాగుతోందని, అది పూర్తయిన వెంటనే మన రాష్ట్ర వాహనాలకు కూడా కొత్త ఫాస్టాగ్ అప్లు అవుతుంది.