21-05-2025 12:00:00 AM
ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రాక
రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో అద్దంకికి ఆత్మీయ సన్మానం..
జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు :తోటమల్ల రమణమూర్తి
ఇల్లెందు, మే 20 (విజయక్రాంతి):భారత రాజ్యాంగంపై మనువాదులు చేసే కుట్రలను తిప్పి కొట్టడానికి భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సు పేరిట ఈనెల 25న భద్రాచలం పట్టణంలో జరిగే సదస్సుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీగా తరలిరావాలని జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి పిలుపు నిచ్చారు.
మంగళవారం ఇల్లందు పట్టణంలో సింగరేణి గ్రౌండ్ లో ఇల్లందు పట్టణ అధ్యక్షులు వేమూరి సాల్మన్ రాజు అధ్యక్షతన నిర్వహించిన జాతీయ మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎడెల్లి గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, భద్రాచలం నియోజకవర్గ నాయకులు రుంజా సుమన్ లతో కలిసి పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని మనువాదుల కుట్రలను వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు ఈనెల 25న భద్రాచలం పట్టణంలోని కేకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు ముఖ్యఅతిథిగా, ప్రధాన వక్తగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొంటారన్నారు.
అనంతరం ఇటీవల ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అద్దంకి దయాకర్ కు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు దీనిలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బల్లెం లక్ష్మణ్, సందా ప్రవీణ్, పట్టణ కార్యదర్శి అబ్బూరి సునీల్, నాయకులు మేడిపల్లి బాబురావు, అంబటి కొండలరావు, పిల్లి బాబురావు, వేమూరి రాజు, గుండమల్ల నాగేంద్రం, దేవీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.