calender_icon.png 1 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కు విరాళం

01-11-2025 12:47:45 AM

రూ.50 లక్షలు అందజేసిన శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్ఠాత్మక హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టుకు ప్రముఖ వ్యాపార సంస్థ శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.50 లక్షల విరాళం లభిం చింది. నర్సింగ్ క్లాత్ ఎంపోరియం మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింగానియా, డైరెక్టర్ రవికాంత్ సింగానియా ఆధ్వర్యంలో ఈ విరాళాన్ని అందజేశారు.

ఈ విరాళ చెక్కును హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస ప్రభుకు అందజేశారు. దీంతో శ్రీ నర్సింగ్ క్లాత్ ఎంపోరియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి హరే కృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టుకు మొత్తం విరాళంగా రూ.1.14 కోట్లు అందా యి. అదే విధంగా, ఈ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.300 కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని కూడా నిర్ణయించింది. సత్యగౌర చంద్రదాస ప్రభూ మాట్లాడుతూ   నర్సింగ్ క్లాత్ ఎంపోరియం సంస్థ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.