17-07-2025 10:44:01 PM
అద్దె చెల్లించకుంటే ఇతరులకు కేటాయిస్తాం: ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి
చేవెళ్ల: ప్రభుత్వం వెనుకబడిన తరగతులను దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రాల్లో ఎస్సీ కార్పొరేషన్ దుకాణాల సముదాయం నిర్మించి అద్దె ఒప్పందంతో లబ్ధిదారులకు ఇచ్చింది. లబ్ధిదారులు ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి అద్దె చెల్లించకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి రంగంలోకి దిగారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ దుకాణం సముదాయాన్ని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మావతి 5 దుకాణల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు.
5 దుకాణాల గాను విట్టలయ్య రూ.19000, గంగి యాదయ్య రూ.41,000, రామస్వామి రూ.50,000, ఈశ్వరయ్య రూ.34000, యాదయ్య రూ.44000 అద్దెలు బకాయిలు ఉన్నాయని అద్దె వెంటనే చెల్లించాలని తెలిపారు. ప్రతినెల ఒక దుకాణానికి రూ.500 చొప్పున ప్రభుత్వానికి అద్దె చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారులు చెల్లించడం లేదని చేశారు. చెల్లించాలని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈనెలాఖరులోగా అద్దెలు చెల్లించకపోతే అద్దె ఒప్పందం రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని పద్మావతి హెచ్చరించారు. నెలకు రూ.500 చెల్లించకపోవడం ఏంటని ఈడి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దుకాణాలు దక్కించుకున్న లబ్ధిదారులు వారే నిర్వహించుకోకుండా ఇతరులకు అద్దెకివ్వడం చట్ట విరుద్ధమన్నారు.