18-07-2025 12:00:00 AM
తాహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ జూలై 17 (విజయ క్రాంతి) : భూ భారతి, రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కారం చేయాని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తహసీల్దార్ లను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వి.సి.కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లతో వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారం,రేషన్ కార్డు ల ఫీల్ ఎంక్వైరీ పై సమీక్షించారు. భూ భారతి, రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలకు సంబంధించి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎంత మందికి నోటీసులు అందజేశారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పరిష్కారం కానీ వారికి నోటీసులను తహసీల్దార్లు జారీ చేయాలని, దరఖాస్తులలో పేరు, కులం, ఆధార్ కార్డు, అడ్రస్, మిస్సింగ్ సర్వే నెంబర్, సాదా బైనామా, ఫారెస్ట్ ల్యాండ్ తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి. ఫీల్డ్, డెస్క్ పరిశీలన పూర్తి చేస్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం చేయాలని తహశీల్దార్ లను ఆదేశించారు.
తహశీల్దార్ల లాగిన్ లో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డుల అప్లికేషన్లు ఉన్నాయని, ఆర్.ఐ. ల వద్ద అప్లికేషన్ వెరిఫికేషన్ చాలా నిదానం గా చేస్తున్నారని, వెంటనే అన్ని అప్లికేషన్లను క్షుణంగా పరిశీలించి డి.ఎస్.ఓ. లాగిన్ కు పంపించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అక్రమ కట్టడాలు, ఆక్రమణలు జరగకుండా పర్యవేక్షించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.