23-08-2025 01:04:51 AM
ప్రజా ప్రభుత్వంలో ఎవరికి నష్టం జరుగనివ్వం: మంత్రి గడ్డం వివేక్
చెన్నూర్ / జైపూర్, ఆగస్టు 22 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, నష్టా న్ని అంఛనా వేయడానికి ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపి తగు చర్య లు తీసుకుంటామని రాష్ర్ట కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి చెన్నూర్ నియో జక వర్గంలోని కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో సిసి రోడ్డు, సెంట్రల్ లైటిం గ్ సిస్టం, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించిన అంతరం కొల్లూరు లో పనుల జాతరలో పాల్గొన్నారు.
చెన్నూర్ మండలం సుందరశాలలో పంట పొలాలను పరిశీలించి లంబాడిపల్లిలో రూ. 8.50 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహ రీ గోడను ప్రారంభించి, రూ. 20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనచేసి, అనంతరం భీమారం, జైపూర్‌లలో రూ. 3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పనుల జాతరలో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.