23-08-2025 01:05:08 AM
ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, ఆగస్టు 22 : కాంగ్రెస్ ప్రజా పాలనలోనే పేద ప్రజల అభ్యున్నతి జరుగుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ నిర్మాణ పనులకు ప్రారంభించారు.
అలాగే రూ.10 లక్షల వ్యయంతో అంగన్వాడి కేంద్రం, గ్రామపంచాయతీ నూతన భవనం, తుంగతుర్తిలో నూతన ఎస్టీవో భవనాన్ని ప్రారంభించి పేదల కోసం పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 18 నెలల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో సుమారు రూ.1400 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు కొనసాగినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, మా లక్ష్మి పథకం, కళ్యాణ లక్ష్మి, ఉచిత రేషన్ కార్డు, నియోజకవర్గంలో సుమారు 3500 పై చిలుకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీకి శ్రీకారం చుట్టి ఒక ఇంటికి ఐదు లక్షలు చొప్పున ఇస్తుందన్నారు. ఒక్క బండ రామారూంలోనే రూ.4 కోట్ల పై చిలుకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ప్రస్తుతం 20 మంది పేదలకు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు రానున్న రోజుల్లో దళితుల కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్, డబల్ రోడ్డు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఓ రైతు ఎస్సారెస్పీ జలాలు వస్తాయా అని అడగగా, వెంటనే సంబంధిత ఎస్. ఈ తో ఫోన్లో మాట్లాడి, పది రోజుల్లో ఎస్సారెస్పీ జలాలు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు, కార్యదర్శి రజిత, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, రేగటి రవి గౌడ్, ఉప్పునూతల. జయచంద్ర రెడ్డి ,మడ్డి కృష్ణమూర్తి ,రేగటి వెంకటేష్, దాయం ఝాన్సీ రెడ్డి పచ్చిపాల సుమతి, యాదగిరి గౌడ్, వీర సోముల యాదవ్, తదితరులు పాల్గొన్నారు.