calender_icon.png 5 November, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం కమిషనింగ్ పకడ్బందీగా ఉండాలి

05-05-2024 12:51:21 AM

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, మే 4(విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సలహాలు, సూచనలిచ్చారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఉండొద్దన్నారు. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులు పక్కాగా ఉండాలన్నారు. కమిషనింగ్ తర్వాత రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో మాక్‌పోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం ఆయన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సందర్శించారు. ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు.