10-07-2025 12:00:00 AM
నలుగురు సీనియర్ ఉన్నతాధికారులకు చోటు
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో కాంట్రా క్ట్, అవుట్‌సోర్సింగ్ నియామకాలు, మంజూరు చేసిన పోస్టులు, నియామక నిబంధనలను, నియామక అవసరాలను సమీక్షించేందుకు కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వు లు జారీ చేశారు.
ఈ కమిటీలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు లు ఉన్నారు.
వీరు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థలు, కార్పొరేష న్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, సంస్థల్లోని నియామకాలతో సహా సిబ్బంది స్థానా న్ని సమీక్షించనున్నారు. కమిటీ ఆయా ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులతో సంప్రదింపులు జరిపి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.