calender_icon.png 10 July, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎడ్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించండి

09-07-2025 11:56:40 PM

70 శాతం ఎస్‌ఏ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయండి..

కార్యదర్శికి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాకు కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) లేఖ రాశారు. డీఎస్సీలో 70 శాతం స్కూల్ అసిస్టెంట్(School Assistant) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే అంశాన్ని పరిశీలించాలని ఈ మేరకు ఆయన లేఖలో కోరారు. 30 శాతం పోస్టులనే నేరుగా భర్తీ చేసి, 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ బీఎడ్ అభ్యర్థులు బుధవారం కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆ అంశాన్ని పరిశీలించాలని లేఖలో వెల్లడించారు. ఇదిలా ఉంటే బీఎడ్ అభ్యర్థులు తలపెట్టిన ఛలో ఎస్‌సీఈఆర్‌టీ పాదయాత్రను వాయిదా వేసినట్లు అభ్యర్థులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.