16-10-2025 01:10:33 AM
లండన్,అక్టోబర్ 15: ప్రతిష్టాత్మక కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ మరోసారి ఆతిథ్యమి వ్వబోతోంది. 2030 కామన్‌వెల్త్‌గేమ్స్ అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నాయి. నైజీరియా రాజధాని అబూజా కూడా పోటీపడుతున్నప్పటకీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మ దాబాద్ పేరును సిఫార్సు చేసింది. నవంబర్ 26న దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నా రు.
అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ స్టేడి యం ప్రపంచంలోనే అతిపెద్దది (1,32,000 సామర్థ్యం) కావడంతో ఇక్కడ నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ కూడా ఆసక్తిగానే ఉంది. గతంలో భారత్ వేదికగా ఢిల్లీలో 2010 కామన్‌వెల్త్‌గేమ్స్ జరిగాయి. మళ్ళీ 20 ఏళ్ళకు ఈ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడాసం బరంగా ఉన్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను అద్భుత రీతిలో నిర్వహించి భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెబుతామని ఐవోఏ ప్రెసిడెంట్ పిటి ఉష చెప్పారు.
2022లో బ ర్మింగ్‌హామ్ వేదికగా ఈ క్రీడలు జరగ్గా.. 2026లో గ్లాస్గో ఆతిథ్యమిస్తోంది. 2010లో సొంతగడ్డపై ఈ గేమ్స్ జరిగినప్పుడు భారత్ రికార్డ్ స్థాయిలో 101 పత కాలు గెలుచుకుం ది. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో వందకు పై గా మెడల్స్ రావడంతో భా రత్‌కు అదే తొలిసారి. గత ఎడిషన్‌లో భార త్ 61 మెడల్స్ గెలిచింది. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఆతిథ్యమివ్వనుండడంతో మరోసారి భారీ సంఖ్య లో పతకాలు గెలిచే అవకాశముంది.