16-10-2025 01:09:29 AM
ప్రెసిడెంట్‌గా మన్వేంద్ర మిశ్రా
సికింద్రాబాద్, అక్టోబర్ 15(విజయక్రాం తి): మేడ్చల్, మల్కాజగిరి జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సికిం ద్రాబాద్‌లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ఏజిఎం కొత్త ప్రెసిడెంట్, సెక్రటరీలతో పా టు సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.సో మేశ్వర్, రంగారెడ్డి ఒలింపిక్ అ సోసియేషన్ కార్యదర్శి జె.మనోహర్ కుమార్ అబ్జర్వర్లుగా వ్యవహరించారు.
కొత్త ప్రెసిడెంట్‌గా మన్వేం ద్ర మిశ్రా, వైస్ ప్రెసిడెంట్లుగా వై.రవీందర్, జి.పద్మజ, జనరల్ సెక్రటరీగా బి.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా కె.రమేష్, పి.కృష్ణార్జునుడు, బి.మురళి, ఎ.ధోరా, ట్రెజరర్‌గా వి.కాశుల్ నాయుడు, ఈసీ మెంబర్లు గా ఎ.హనుమంతు, ఎన్.సం దీప్, డి.సౌమ్య, ఎన్.శశిధ ర్, ఎల్. సిద్ధు వరప్రసాద్, ఎన్.కతిలక్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గానికి పలు వురు అభినందనలు తెలిపారు.