16-10-2025 01:14:33 AM
-వైభవ్, పృథ్వీ షా ఫ్లాప్ షో
-రంజీ ట్రోఫీ రౌండప్
కోల్‌కత్తా, అక్టోబర్ 15 :ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 91వ ఎడిషన్ ఆసక్తికరంగా ప్రా రంభమైంది. తొలిరోజు పలువురు భారత ఆటగాళ్ళు సత్తా చాటారు. జాతీయ జట్టుకు దూరమైన వెటరన్ పేసర్,బెంగాల్ బౌలర్ మహ్మద్ షమీ సంచలన స్పెల్‌తో మెరిసాడు. ఉత్తరాఖండ్‌పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి సెలక్టర్లకు కౌంటరిచ్చాడు.ఫిట్‌గా లేడన్న అనుమానాలతో ఎంపిక చేయలేదన్న సెలక్టర్లకు తన బౌలింగ్‌తోనే సమాధానమిచ్చాడు.
అటు జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీతో దుమ్మురేపాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 125(14 ఫోర్లు,2 సిక్సర్లు) రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. అలాగే పడిక్కల్(96),కరుణ్ నాయర్(73), రుతురాజ్ గైక్వాడ్(91), ఆం ధ్రా కెప్టెన్ శ్రీకర్ భరత్(142), షేక్ రషీద్(94 నాటౌట్) పరుగులతో రాణించారు. అయితే అంచనాలు పెట్టుకున్న 14 ఏళ్ళ వైభవ్ సూ ర్యవంశీ(14), పృథ్వీషా(0) నిరాశపరిచారు.