3 April, 2026 | 2:28 AM

ఆటిజం చిన్నారులకు కమ్యూనికేషన్ బోర్డు

03-04-2026 12:40 AM

దేశంలోనే తొలి వినూత్న ప్రయోగం

బంజారాహిల్స్, ఏప్రిల్ 2 (విజయాక్రాంతి) : ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న చిన్నారుల కమ్యూనికేషన్ సామర్థ్యాలను పెంపొందించే దిశగా హైదరాబాద్లో అరుదైన ముందడుగు పడింది. బంజారాహి ల్స్లోని కేబీఆర్ పార్కులో దేశంలోనే తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక కమ్యూ నికేషన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీతో పాటు అవాజ్, మర్హమ్ రిజోనేటింగ్ రెసిలెన్స్ ఎన్జీఓ, సీడీసీ టాక్ అండ్ లెర్న్, కోరు కిడ్జ్ సంస్థలు సం యుక్తంగా చేపట్టాయి.

ఆటిజం ఉన్న పిల్లలు మాటల ద్వారా తమ భావాలను వ్యక్తపరచడంలో ఎదుర్కొనే ఇబ్బందు లను దృష్టిలో ఉంచుకుని, విజువల్ చిహ్నాల ఆధారంగా ఈ బోర్డును రూపొందించారు. అవాజ్ డాట్ కామ్ ప్లాట్ఫారమ్ నుంచి ఎంపిక చేసిన చిహ్నాలు పిల్లలు తమ అవసరాలు, అభిరుచులు, భావోద్వేగాలను సులభంగా తెలియ జేయడానికి ఉపయోగపడతాయి.

ప్రపంచ ఆటిజం దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొని బోర్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిన్ని ప్రదేశాల్లో అమలు చేస్తే, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అనుకూలమైన సమాజ నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.