20-10-2025 12:57:11 AM
చండూరు,(మర్రిగూడ) అక్టోబర్ 19 : విద్యార్థులు బాగా కష్టపడి అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, సేవ చేయాలంటే పదవులు అవసరం లేదని సామాజిక సేవా దృక్పథం ఉండాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మిరాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ పాండిషన్ ఆధ్వర్యంలో ఒక కోటి 50 లక్షల తన సొంత నిధులతో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఉమ్మడి నల్లగొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కస్తూరిభా పాఠశాలకు అన్ని వసతులు కల్పించిన ఎమ్మెల్యే దంపతులకు పాఠశాల విద్యార్థులు కోలాటాల, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అండగా ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి ఉంటుందన్నారు.విద్య, వైద్యం, ప్రతి సమస్య ఉన్న పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలన్నారు.
చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దని, చదువుతోపాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా అవసరమన్నారు.. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎల్లవేళల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అధికారులు, కస్తూరిభా పాఠశాల ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.