31-10-2025 12:26:09 AM
అజారుద్దీన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటే ఆ రెండు పార్టీలే అడ్డుకుంటున్నాయి
పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్
నిజామాబాద్ అక్టోబర్ 30: (విజయ క్రాంతి): బీజేపీతో బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని కుట్రలు పన్నుతోందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. భారత క్రికెటర్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ రెండు పార్టీలే అడ్డుకుంటున్నాయని, మైనార్టీల సంక్షేమం ఆ రెండు పార్టీలకు పట్టదని విమర్శించారు. అజారుద్దీన్ మంత్రి పద వి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ గవర్నర్‌పై ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.
గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. అజారుద్దీన్‌ను మంత్రి కా కుండా ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం విచారకరమన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రజలకు తెలియాల్సి న అవసరముందన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ కూతురు కవిత స్వయంగా చెప్పారని, అజారుద్దీన్ మంత్రి పదవిని అడ్డుకోవడంతో ఈ విషయం స్పష్టమవుతుంద న్నారు.
మైనార్టీలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే అజారుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపిం చారు. జూబ్లీహిల్స్ ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, వారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం అని మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. న్యాయపరమైన విషయాల్లో కోర్టు లో గెలిచితీరుతామన్న నమ్మకం తమకుందని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, నగే ష్ రెడ్డి, జావిద్ అక్ర మ్,మారా చంద్రమోహన్ అరికల నర్సారెడ్డి పాల్గొన్నారు.