calender_icon.png 31 October, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవ ఘటనల ఆధారంగా ‘కర్మణ్యే వాధికారస్తే’

30-10-2025 11:07:37 PM

బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్తచిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్‌దీప్ చల్లపల్లి దర్శకత్వంలో ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డీఎస్‌ఎస్ దుర్గాప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో బెనర్జీ, పృథ్వీ, శివాజీరాజా, అజయ్త్న్రం, శ్రీసుధ, జయరావు, బాహుబలి మధు ముఖ్యపాత్రల్లో నటించారు. కృష్ణ భట్, ఇరా దయానంద్, అయేషా, రెహానా ఖాన్ ఈ సినిమాతో నటులుగా పరిచయమవుతున్నారు. సినిమా అక్టోబర్ 31న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం మూవీ రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దుర్గాప్రసాద్ మాట్లాడుతూ “కర్మణ్యే వాధికారస్తే’ రిలీజ్ ప్రోమో చూసిన వాళ్లంతా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇదొక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్. టైటిల్‌కి తగ్గట్టే కథ కూడా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్స్.. ఇలా ప్రతిరోజూ టీవీలు, పేపర్లలో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. మా చిత్రం అక్టోబర్ 31న విడుదలవుతోంది” అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని; సాహిత్యం: శ్రేష్ఠ; డీవోపీ: భాస్కర్ సామల; ఫైట్స్: రామ్ సుంకర, డ్రాగన్ అంజి; ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్; ఆర్ట్: నాయుడు; నిర్మాత: డీఎస్‌ఎస్ దుర్గాప్రసాద్; కథ, మాటలు: శివకుమార్ పెళ్లూరు; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమర్‌దీప్ చల్లపల్లి.