30-10-2025 11:03:22 PM
స్టార్ హీరో శర్వా ఇప్పుడు ‘బైకర్’ సినిమాతో వస్తున్నారు. ఇందులో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఫస్ట్‌లుక్, టైటిల్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు.
ఈ మూవీ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ గురువారం నుంచి థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్టు ప్రకటించారు. ‘బాహుబలి: ది ఎపిక్’, ‘మాస్ జాతర’ సినిమాలతో కలిసి ఈ గ్లింప్స్ చూడొచ్చని పేర్కొన్నారు. ఇక ఈ గ్లింప్స్ డిజిటల్‌గా నవంబర్ 1న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు టీమ్ బుధవారం రిలీజ్ చేసిన సెకండ్ లుక్ పోస్టర్‌లో శర్వా స్టైలిష్‌గా కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్; సినిమాటోగ్రఫీ: జే యువరాజ్; ఎడిటర్: అనిల్‌కుమార్ పీ; ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వం.