calender_icon.png 31 October, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా తరహాలో వైడ్రా?

31-10-2025 12:23:53 AM

వరంగల్‌లో వరద విపత్తుల నేపథ్యంలో సీఎం నిర్ణయం

త్వరలో మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (హైడ్రా) తరహాలో వరంగల్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (వైడ్రా) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. సీఎం నవంబర్ మొదటివారంలో వైడ్రా అంశంపై మం త్రులు, ఇన్‌చార్జ్ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కానున్నారని తెలిసింది.

భేటీకి రెవెన్యూ, మున్సిపల్, ‘కుడా’ అధికారులు సైతం వర దలు, విపత్తులకు సంబంధించిన డాటాతో హాజరవుతున్నట్లు తెలిసింది. 2021లో వరదలు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను అతలాకుతలం చేశాయి.  తాజాగా కురిసిన భారీ వర్షాలకు ట్రై సిటీలైన వరంగల్, హనుమకొండ, కాజీపేటను వరద లు ముంచెత్తాయి. 

సీఎం ఈ తీవ్రతను గుర్తించే వైడ్రా ఏర్పాటు చేయాలనే నిశ్చయానికి వచ్చినట్లు తెలిసింది. అదే నిజమైతే.. ఇక మూ డు సిటీలవాసులకు వరద ముప్పు తప్పినట్లే. అలాగే కొత్తగా ఏర్పాట య్యే వ్యవస్థతో చెరువులు, నాళా లు, కాలువలు, పార్క్‌లు, ఖాళీ స్థలా లు, ప్రభుత్వ భూములకు భద్రత ఉంటుంది.