calender_icon.png 31 October, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట నష్టపోయిన కౌలు రైతు చడపంగు వెంకటేశ్వర్లు ఆవేదన

30-10-2025 11:08:08 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామానికి చెందిన కౌలు రైతు చడపంగు వెంకటేశ్వర్లు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. తుఫాను కారణంగా పంట నష్టపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గురువారం ఆయన మాట్లాడుతూ కౌలుకు తీసుకొని సాగు చేసిన వరి తుఫానుతో నష్టపోయినట్లు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. ప్రభుత్వం, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. నష్టపోయిన పొలాన్ని చూపుతూ కన్నీరు మున్నీరయ్యాడు.