31-10-2025 12:26:37 AM
-దబాంగ్ ఢిల్లీ X పుణేరి పల్టాన్
-నేడు ప్రో కబడ్డీ సీజన్ 12 ఫైనల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ చివరి అంకానికి చేరింది. శుక్రవారం న్యూఢిల్లీ త్యా గరాజ్ ఇండోర్ స్టేడియం వేదికగా దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టాన్ టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. లీగ్ స్టేజ్‌ను ఇరు జట్లు టాప్ 2 స్థానాల్లో ముగించడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయం. క్వాలిఫైయర్ దబాంగ్ ఢిల్లీ టై బ్రేకర్ ద్వారా పుణేరి పల్టాన్‌ను ఓడించింది. ఎనిమిదో సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన ఢిల్లీ మరోసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.
హోం గ్రౌండ్‌లో ఆడుతుండడం ఢిల్లీకి అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. ఫజల్ అత్రాచలి, సౌరవ్ నందల్, అషు మాలిక్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఆ జట్టుకు కీలకం కానున్నారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఈ ముగ్గురూ అద్భు తం గా రాణిస్తుండడం కూడా ఢిల్లీకి కలిసొచ్చే అంశం. మరోవైపు గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న పుణేరి పల్టాన్ 10వ సీజన్‌లో విజేతగా నిలిచింది. ఇప్పుడు రెండో టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఎదురుచూస్తోంది. యువ రైడర్లు ఆదిత్య షిండే, అస్లామ్ ఇనామ్‌దార్ పుణేకు ప్రధాన బలం.
తెలుగు టైటాన్స్‌కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకొచ్చిన పుణేరి పల్టాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. మొత్తం మీద రెండు నెలలుగా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో సాగుతున్న ప్రో కబడ్డీ సీజన్ 12 టైటిల్ పోరు కూడా రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి మార్పులు చేశారు. ఐదో స్థానం నుంచి ఎనిమిదో స్థానం వరకూ నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో తలపడ్డాయి.
దీనిలో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. తర్వాత ఎలిమినేటర్ 2, 3, మినీ క్వాలిఫైయర్, క్వాలిఫైయర్ నిర్వహించారు. మొత్తం 12 జట్లు పోటీపడగా.. అభిమానుల్లో ఆసక్తి పెంచేందుకు ఎక్కువ జట్లకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం కల్పించారు. ఫైనల్‌కు ఢిల్లీ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి.