31-10-2025 12:25:18 AM
-మెల్‌బోర్న్‌లో జరిగిన ఘటన
-క్రికెట్ ప్రపంచంలో విషాదం
మెల్‌బోర్న్, అక్టోబర్ 30: క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి ఓ యువక్రికెటర్ మృతి చెందాడు. మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ ఒక స్థానిక టీ20 మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాటిం గ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతని తల, మెడకు మధ్య బలంగా తాకడంతో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు హుటాహు టిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశాడు.
ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. అతను ప్రాతినిథ్యం వహిస్తు న్న ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిం ది. అతని కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనతో గతంలో ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ ఉదంతాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 2014లో హ్యూస్ రాకాసి బౌన్సర్‌కు మృతి చెందాడు. హ్యూస్ మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్నీ షాక్‌కు గురిచేసింది.