31-10-2025 10:36:42 PM
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు
మోతె: తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రైతుకు రూ.30 వేల పరిహారం అందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలమట్టమైన పంట పొలాలను రైతులతో పరిశీలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా తడిసిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరనీ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఐకెపి కేంద్రాలలో వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ సరైన వసతులు కల్పించి ఉంటే రైతులు ఇంతగా నష్టపోయే అవకాశం ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.