01-11-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ అక్టోబర్ 31 (విజయక్రాంతి) : దేశ ప్రజలు సమైక్యంగా ఉన్నప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని జిల్లా ఎస్పీ జానక షర్మిల అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలు పురుషకుని నిర్వహించిన సైమేక్యత దినోత్సవంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించగా ఇందులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎస్పి రాజేష్ కుమార్ జిల్లా పోలీసులు పాల్గొన్నారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతగానో కృషి చేశారని అదే స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
సమైక్యత ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే
బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాదులో శుక్రవారం నిర్వహించిన టుకే రన్‌లో నిర్మ ల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత అవగాహన 2కే రన్ను నిర్వహించగా మహేశ్వర్ రెడ్డి అందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి అగ్ర నాయకులు లక్ష్మణ్ ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నారు.