09-10-2025 12:00:00 AM
మణుగూరు, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : మద్యం దుకాణాలకు నూతన లైసెన్స్ ల కోసం ఆశవాహులు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్ గా మారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. లక్కీ డ్రా లో పాల్గొనాలంటే రూ 3 లక్ష లు డిడి చెల్లించాలి. డ్రాలో షాప్ దక్కకపోతే ఆ నగదు గోవింద. ఇంత డబ్బు ఒక్కరే కట్టిలేక షాపు దక్కకపోతే ఆర్థికంగా నష్ట పోతామని భావిస్తున్న కొందరు గ్రూపులుగా ఏర్పడి టెండర్లు వేస్తున్నారు.
లాటరీలో వైన్ షాప్ ఒకటి తగిలితే చాలు పరపతి పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దిగువ స్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. యువకులు, మహిళలు, నేతలు, కాంట్రాక్టర్లు అనే తేడా లేకుండా మద్యం షాప్ టెండర్ల కోసం క్యూ కడుతున్నారు. జిల్లా కేంద్రంలో అధికారులు మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. దీనిపై విజ యక్రాంతి కథ నం..
వ్యాపారుల్లో కిక్కు..
జిల్లా వ్యాప్తంగా వైన్ షాప్ టెండర్ల ను దక్కించుకోవడానికి వ్యాపారులు సిండి కేట్లుగా మారి దరఖాస్తులు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే, రాష్ట్ర ప్రభుత్వం కొత్త వైన్ షాప్ టెండర్ల నోటిఫికేషన్ ను విడుదల చేయడంతో, అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు మరి కొంతమంది టెండర్లు దక్కించు కునేందుకు ఉవ్విళ్లూరు తున్నారు. కొందరు జాతకాల ఆధారంగా దరఖాస్తులు చేస్తున్నారు. పేరు, నక్షత్రం బట్టి ఉన్నవారిలో ఎవరి జాతకం బలంగా ఉందో వారి పేరిట అర్జీ చేస్తున్నవారు.
జాతకం బాగుందనిపిస్తే ఆధార్కార్డు, బ్యాంకు పుస్తకాలు తీసు కుని పెట్టుబడి పెట్టకపోయినా ఆ పేరుతో దరఖాస్తు చేయడానికి కొందరు సిద్ధమయ్యారు. లీడర్ల నుంచి దిగువ స్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పైఎ త్తులు వేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలోని ఎంప్లాయిస్ సైతం దుకాణాల కోసం పోటీపడుతున్నారు. దరఖాస్తులకు పరిమితి లేకపోవడంతో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో టెండర్లకు అప్లికేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏదేని ఒకటైనా తగలక పోతుందా, అనే ఆలోచనతో పోటీపడు తున్నారు. జిల్లాలో ప్రెజెంట్ మద్యం దుకాణాలపైనే చర్చోప చర్చలు సాగుతున్నా యి.
సిండికేట్‌గా మారుతున్న దరఖాస్తుదారులు...
మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం లక్కి డ్రా రూ 3లక్షల పెద్ద మొత్తంలో ఉండడంతో వ్యాపారులు ముందస్తు వ్యూహం తో సిండికేట్గా ఏర్పడి దర ఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇక ఒక్కో గ్రూపు లో 5 నుంచి 20 మంది వరకు ఉం టున్నారు. రూ.3 లక్షలు జమ చేసి ఒక్కరి పేరుపై టెండర్ దాఖలు చేస్తున్నారు. పోతే రూ.3 లక్షలు, లక్కు కుదిరితే మాత్రం పంట పండినట్లేనని ఆశావహులు భావిస్తున్నారు. ఇక మరి కొందరు ఒక్క వైనాపుకే పరిమితం కాకుండా పలు షాపులకు దరఖాస్తులు చేస్తున్నారు. ఒక చోట కాకపోతే మరో చోట కలిసి వస్తుందనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
పెరగనున్న దరఖాస్తులు...
మద్యం దుకాణాల టెండర్లకు గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. కొత్త పాలసీతో పాటు, రిజర్వేషన్లు అనుకూలంగా రావ డంతో ఆయా వర్గాల వారు దరఖా స్తులు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని 88 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తు న్నారు. దరఖాస్తులకు ఈనెల 18తేదీ వరకు అవకాశం ఉంది. గడువు సమీపి స్తుండటంతో దరఖాస్తులు ఊపందు కోను న్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గుడ్ విల్‌తో సిద్ధం..
మద్యం దుకాణాల టెండర్ ఎలా గైనా దక్కించుకోవాలని చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు. కొందరితో కలిసి సిండికేట్గా ఏర్పడుతున్నారు. వారిపేరు పైనే షావు దక్కితే సరే, రాకపోయినా షాపు మాత్రం వదిలేది లేదని ఆశావహులు భావిస్తున్నారు. లక్కి డ్రాలో ఎవరికి షాప్ దక్కినా నిర్వహణ మాత్రం తామే చేపట్టేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వైన్ నిర్వహణలో పెద్దగా అనుభవంలేని వారికి లక్కి డ్రా దక్కితే అప్పటికప్పుడే వారికి గుడ్విల్ ఇచ్చి షాపును చేజిక్కిం చుకునేందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోతేపోని, వస్తే మనదే కదా అని ఆశావాహుల టాక్ వినబడుతుంది.