23-08-2025 05:33:05 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో హెచ్ఐవి, ఎయిడ్స్, రక్తదానం అనే అంశాలపై కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. స్థానిక కళాశాల నుంచి పోటీల్లో పాల్గొన్న పడియార్ శ్రుతి, తెల్లం నాగ శృతి HB ప్రథమ బహుమతులను గెలుచుకున్నారు. వీరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ జయలక్ష్మి ప్రశంస పత్రాలతో పాటు నగదు బహుమతిలను అందజేశారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హెచ్. వెంకటేశ్వరరావు అభినందించారు.జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినులను శనివారం కళాశాలలో ఏర్పాటైన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. కల్పన, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎస్కే అతహర్ అలీ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.