13-08-2025 12:46:48 AM
చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 12 : ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడిసాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ బి.అనురాధ సూచించారు. చిన్నకోడూర్‌పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలు, రిసెప్షన్ రికార్డులు, రైటర్ రూంలను పరిశీలించారు. వివిధ కేసుల్లో ఉన్న వాహనాలనుసంబంధిత యజమానులకుఅప్పగించాలని ఎస్‌ఐకి సూచించారు.
కేసుల పరిశోధన పారదర్శకంగా ఉండాలని, విధినిర్వహణలో అలసత్వం వహిస్తేక్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇసుక, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా, జూదం అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు.
విలేజ్ పోలీస్ ఆఫీసర్లకు కేటాయించిన గ్రామాలను తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. కమిషనర్ వెంట సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, చిన్నకోడూర్ ఎస్‌ఐ సైఫ్ అలీ, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్బి ఎస్‌ఐ చంద్రమోహన్, సిబ్బంది ఉన్నారు.