calender_icon.png 14 August, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతారహితమైన సిబ్బందిపై కఠిన చర్యలు

13-08-2025 12:45:38 AM

నంగునూరు, ఆగస్టు 12: నంగునూరు మండలం రాజగోపాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనూహ్య తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి అక్కడి సిబ్బంది పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రంలో జరుగుతున్న అవకతవకలను, అధికారుల నిర్లక్ష్య వైఖరిని కలెక్టర్ స్వయంగా చూసి నివ్వెరపోయారు. సిబ్బంది విధుల్లో లేకపోవడం, ఇష్టానుసారంగా డెప్యుటేషన్లపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తక్షణమే ఈ డెప్యుటేషన్లన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు, ఔట్ పేషెంట్ రిజిస్టర్లను మెడికల్ ఆఫీసర్లు కాకుండా, స్టాఫ్ నర్సులు రాయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పద్ధతులు రోగుల ఆరోగ్యానికి ప్రమాదకరం అని హెచ్చరించారు. స్టాఫ్ నర్సులు ఓపీ రిజిస్టర్ రాసి మందులు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.