23-07-2025 04:37:24 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): వామపక్ష, విద్యార్థి సంఘాల విద్యా సంస్థల బంద్ బుధవారం సంపూర్ణంగా జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్, కార్పొరేట్ సంస్థల అధిక ఫీజులు, పాఠశాలు, కళాశాలల విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇతర విద్యార్థి సంఘాలు కలసి బంద్ కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ పాటించాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు సంపూర్ణంగా బంద్ పాటించగా, ప్రభుత్వ విద్య సంస్థలు పాక్షికంగా పాల్గొన్నాయి. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ సంఘాలు విద్యాసంస్థల బంద్ ను ప్రకటించాయి. విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని మొదటిసారిగా ఆర్ ఎస్ యూ కూడా బంద్ కు పిలుపు ఇవ్వడం గమనార్హం.