23-07-2025 04:39:43 PM
మేడిపల్లి: హంటింగ్టన్ అనే నరాల సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న యువకుడు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పరిధిలో నివసించే కోడి రేఖ రవి కుమార్, కుమారుడు కోడి రేఖ సాయి జథీన్(22) అనే యువకుడు నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. రెండు రోజుల క్రితం మాదాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో చూసినట్లు సమాచారం అందిందని, అప్పటినుండి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కావున ప్రజలు సాయి జథీన్ ని గమనిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని లేదా ఈ నెంబర్ 8712662702 కు సమాచారం అందించాలని మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి తెలియజేశారు.