calender_icon.png 24 July, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా విద్యాసంస్థల బంద్

24-07-2025 12:21:57 AM

- స్వచ్ఛందంగా బంద్ పాటించిన ప్రైవేట్ విద్యాసంస్థలు

- సెక్రటేరియేట్ ముట్టడికి యత్నం

- నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారంతోపాటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల ని యంత్రణకు ప్రత్యేక చట్టం అమలు, పెండింగ్ ఫీజురీయెంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు దాదాపు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించగా, ప్రభుత్వ విద్యాసంస్థలను మాత్రం జిల్లాల్లో విద్యార్థి సంఘాల నేతలు మూసివేయించారు.

ఈ బంద్‌లో ఏడు వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మంచిర్యాల, భువనగిరి, కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేసినట్టు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి సెక్రటేరియట్‌కు చేపట్టిన చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో, ఏఐఎస్‌బీ, ఏఐఎఫ్‌డీ ఎస్, ఏఐపీఎస్‌యూ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వ హించారు. ర్యాలీ సమాచారం అందుకున్న పోలీసులు ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేశా రు. ఈ సందర్భంలో విద్యార్థి సంఘాల నేత లు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల నేతలు, మహిళలను పోలీసులు అడ్డుకుని పలు స్టేషన్లకు తరలించారు. పోలీసుల అరెస్టులకు నిరసనగా గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చాయి. 

ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి..

విద్యార్థి సంఘాల నేతలు పుట్ట లక్ష్మణ్, కసిరెడ్డి  మణికంఠ రెడ్డి (ఏఐఎస్‌ఎఫ్) టీ నాగరా జ్, రజనీకాంత్ (ఎస్‌ఎఫ్‌ఐ), సాయిబోల అనిల్, పొడపంగి నాగరాజు, మొగిలి వెంకట్‌రెడ్డి (పీడీఎస్‌యూ), గడ్డం నాగార్జున, పల్లె మురళి (ఏఐఎఫ్‌డీఎస్), హకీం నవీద్ (ఏఐఎస్‌బీ), నితీష్(ఏఐడీఎస్‌వో), మనే కుమార్ (ఏఐపీఎస్‌యూ) మాట్లాడుతూ.. విద్యాశాఖకు కనీసం మంత్రి లేడని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.

రాష్ర్టంలో 2,253 ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదని, 1,500 పైగా పాఠశాలల్లో టాయిలెట్స్, 28 వేలకుపైగా పాఠశాలల్లో కంప్యూటర్లు లేవన్నారు.  గత ప్రభుత్వం పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకం తీసుకొచ్చినా.. దాన్ని అమలు చేయ డం లేదని, మధ్యాహ్నం భోజనానికి పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు ఇవ్వాల్సి ఉ న్నా వాటిని పెంచడం లేదని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.

పోస్టులను భర్తీ చేయాలి..

ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో  రూ.ల క్షల ఫీజులు వసూలు చేస్తున్నారని, అడ్మిషన్ల పేరుతో డొనేషన్లు.. పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ విక్రయంతో లక్షల రూపాయల దందా కొనసాగిస్తున్నా ప్రభుత్వం నియంత్రించడం లేదన్నారు. రాష్ర్టంలో తక్షణమే ఫీజు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో వరుసగా 93 మంది చనిపోయారని, అద్దె భవనాల్లో నడుస్తున్న 662 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

పెండింగ్‌లోని రూ.8 వేల కోట్ల ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు ఎం మమత, డీ కిరణ్, అశోక్ రెడ్డి, రమ్య, నాగేందర్, స్టాలిన్, రజనీకాంత్, కైలాస్, చైతన్య, రెహమాన్, అనిల్ కుమార్, హుస్సేన్, అరుణ్, తేజ, నితీష్, హరీశ్, నాగరాజు, సాయి, ప్రసాద్, బీమ్‌సేన్, నవిత, క్రాంతి, పీ మహేశ్, శ్రీను, శ్యామ్, గౌతమ్, శ్రీకాంత్, ప్రణయ్, వరుణ్, సూర్యకిరణ్, గణేశ్, సైదులు, వంశీ పాల్గొన్నారు.