calender_icon.png 11 July, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు అండగా సీఎంఆర్‌ఎఫ్

11-07-2025 12:00:00 AM

టీపీసీసీ జాయింట్ సెక్రటరీ అజీజ్ పాషా

హుజూర్ నగర్, జూలై 10:  పేద ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని టిపిసిసి జాయింట్ సెక్రటరీ అజీజ్ పాషా అన్నారు.గురువారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన షేక్ జానిమియాకు 60 వేల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేసి మాట్లాడారు.

మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది నుండి త్వరత్వరిగతిన భాధితులకు ఆర్థిక సహాయం అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు,బొడ్డు గోవిందరావు,బంటు సైదులు,గంజి శివ,మచ్చ సంజీవ్ గాంధీ,పోతబత్తిని శీను,దగ్గుపాటి నాగరాజు,భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.