calender_icon.png 9 August, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలా పనులు త్వరగా పూర్తి చేయండి

08-08-2025 01:16:17 AM

- అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తలసాని 

సనత్‌నగర్ ఆగస్టు 7 (విజయక్రాంతి):- నాలా పెండింగ్ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమీర్‌పేట డివిజన్ లోని గాయత్రినగర్‌లో చేపట్టిన నాలా నిర్మా ణ పనులు పూర్తికాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని, పనులు త్వరగా పూ ర్తి చేయించాలని కాలనీ వాసులు ఇటీవల మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విన్నవించారు.

స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేరోజు అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి నాలాను పరిశీలించారు. ఈ నాలా పనుల పూర్తితో గాయత్రినగర్ వాసుల  ఎ న్నో సంవత్సరాల సమస్య పరిష్కారం అయినట్లేనని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఈఈ వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ జీఎం ప్రభాకర్, టౌన్ ప్లానింగ్, సయ్యద్, ఎలెక్ట్రికల్ ఏడీ కిషోర్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్,  ప్రవీణ్‌రెడ్డి, నామన సంతోష్ కుమార్, కూతురు నర్సింహ, గోపిలాల్ చౌహన్, కట్టా బలరాం, టిల్లు బాయ్, కాలనీ వాసులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.

క్రిస్టియన్‌ల అభ్యున్నతికి కృషి చేస్తా

క్రిస్టియన్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సనత్‌నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. తనను కలిసిన  నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్‌లకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి జయరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ పాల్, సభ్యులు విలియం, ప్రణయ్, సునీల్, దేవదాస్, జయ, సురేష్ మనోహర్, సామ్ సన్, పరమానందం తదితరులు పాల్గొన్నారు.