09-08-2025 03:16:25 AM
-మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
- ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షాబంధన్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ర్టంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మ హిళా సాధికారతతో పాటు మహిళలను కో టీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభు త్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అ మలు చేస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేసినట్టు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలం దరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్ర భుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభు త్వం తగు చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.
ఆప్యాయతకు ప్రతీక
అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల ప్రేమ అనురాగం, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అలాంటి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లోని సోదరసోదరీమ ణులు ఘనంగా జరుపుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. తోడపుట్టిన సోదరికి కష్ట సుఖాల్లో ఆ జన్మాంతం తోడుంటానని సోదరుడు ఇచ్చే అభయమే రక్షాబం ధన్ అని యుగాలు మారినా, తరాలు మారి నా రాఖీ పౌర్ణమి ప్రత్యేకత అలాగే నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ.. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం మొదటి నుంచి మహిళల పక్షపాతి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలోని కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఇం దిరమ్మ ప్రజప్రభుత్వం పనిచేస్తోందని, ప్ర భుత్వ పథకాల్లో ఆడబిడ్డలకు ప్రజా ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.