17-12-2025 01:48:19 AM
హైదరాబాద్, డిసెంబర్ 16(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ 2008 నుంచి గత 17 ఏళ్లుగా సుమారు రూ. 118 కోట్ల కరెంట్ బిల్లు చెల్లించలేదంటూ టీజీఎస్‌పీడీసీఎల్ ఆ యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు యూనివర్సిటీ రూ.118 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో మంగళవారం విచారణ చేప ట్టిన జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సామాన్యులు రూ.1000 కట్టకపోతే అధికారులు విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని.. గీ తం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిం దిగా విద్యుత్ శాఖ ఎస్‌ఈ హాజరుకావాలని ఆదేశించారు. గీతం యూనివర్సిటీ విద్యుత్ బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడం పై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
రూ. 118 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడమే కాకుండా.. అధికారులు దీనిపై మెతక వైఖరి ప్రదర్శించడంపై మండిపడ్డారు.సామాన్య ప్రజలు రూ. 1000 బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులు బాటు ఎందుకుని ప్రశ్నించింది. ఈ అంశం పై పూర్తి వివరాలు సమర్పించాలని సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సామాన్యులైతే ముక్కుపిండి వసూలు చేస్తారా?
ఈ కేసును విచారించిన జస్టిస్ నగేశ్ భీమపాక విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాన్యు లు కేవలం వెయ్యి రూపాయల బిల్లు చెల్లించకపోయినా.. కనికరం లేకుండా విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్న అధికారులు.. ఇన్ని కోట్లు బకాయి ఉన్న వర్సిటీపై ఎందుకు చర్య లు తీసుకోలేదని ప్రశ్నించారు.
గీతం వర్సిటీకి ఏమైనా ప్రత్యేక వెసులు బాటు ఉందా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొ గ్గి అధికారులు మిన్నకుండిపోయారా? అని నిలదీశారు. మూడు వేర్వేరు ప్రభుత్వాలు మారినా, ఈ బకాయిల వసూలు ప్రక్రియ జరగకపోవడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.