08-05-2025 12:46:30 AM
న్యూఢిల్లీ, మే 7: వైమానిక దాడులు జరిగినపుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని తెలుపుతూ బుధవారం దేశవ్యాప్తంగా పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. దేశంలోని 244 జిల్లాల్లో గల 259 ప్రాంతాల్లో ఈ డ్రిల్స్ చేపట్టారు. ఈ 259 ప్రాంతాలను మూడు క్యాటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 32 జిల్లాల్లో ఈ డ్రిల్స్ నిర్వహించారు.
ఈ డ్రిల్స్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కాసేపు విద్యుత్ నిలిపివేశారు. ఢిల్లీలో డ్రిల్స్ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌కు కొద్దిసేపు విద్యుత్ నిలిపివేశారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో ఈ డ్రిల్స్ చేపట్టారు. ఈ డ్రిల్స్‌లో భాగంగా విమానాశ్రయాల్లో, రైల్వేస్టేషన్లలో పౌరులకు అవగాహన కల్పించారు.