01-11-2025 05:15:49 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలీ..
పేదలకు నాణ్యమైన వైద్యం అందించి యశోద ట్రస్ట్ వైద్యశాల
చిలుకూరులో యశోద ట్రస్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం
ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి..
కోదాడ/చిలుకూరు: గ్రామీణ ప్రాంతం చిలుకూరులో కార్పొరేట్ స్థాయి వైద్యశాల ఏర్పాటు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శనివారం చిలుకూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యశోద ట్రస్ట్ హాస్పిటల్ ను ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు పూర్తి వ్యాపార ధోరణితో కాకుండా సేవ దృక్పదంతో సేవలు అందించాలన్నారు. నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల్లో వైద్యశాల పేరు గడించాలి అన్నారు. పేదలకు అందుబాటులో ఉండే వైద్యశాలలకు ప్రభుత్వం పక్షాన సహకారాలు అందిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు వైద్య శాల సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వైద్యశాల నిర్వాహకులు మాట్లాడుతూ వైద్యశాలలో జనరల్ వ్యాధుల, యాక్సిడెంట్ కేసులు, చిన్న పిల్లల, గుండె సంబంధిత వ్యాధుల నిర్ధారణ, మహిళల కు ప్రసూతి, దీర్ఘ కాలిక వ్యాధులు బీపీ షుగర్ తో పాటు చర్మ వ్యాధుల చికిత్స, అన్ని రకాల అధునాతన సదుపాయాలతో ల్యాబ్ సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో యశోద ట్రస్ట్ హాస్పటల్ యజమానం కాసాని దశరథ యశోద గ్రామ శాఖ అధ్యక్షులు సోందుమియా కొడారు బాబు కడియాల వెంకటేశ్వర్లు వట్టి కోటి నాగయ్య గరినే శేషగిరిరావు వట్టికూటి వెంకటేశ్వర్లు అశోక్ ఉపేందర్ సురేష్ రావిలాల ఉత్తేజ్ మంగయ్య శ్రీనివాసరావు నాగేశ్వరరావు బండి కాశయ్య బంధుమిత్రులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.