calender_icon.png 1 November, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాను నష్టాలను శాఖల వారీగా సేకరించాలి

01-11-2025 05:16:33 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో సంభవించిన నష్టాలను వెంటనే శాఖల వారీగా సేకరించాలని అదనపు కలెక్టర్లు పి. అమరేందర్, దేవ సహాయం అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. వ్యవసాయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, గృహనిర్మాణ తదితర శాఖలు ఖచ్చితమైన అంచనాలు సిద్ధం చేసి ఫోటోలు, వీడియోలతో పంపాలన్నారు.

తాత్కాలిక పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టి, శాశ్వత పనులకు అంచనాలు సాయంత్రం నాటికి సమర్పించాలన్నారు. పశుసంవర్ధక శాఖ పశువుల నష్టాల వివరాలు, పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, భవనాలు, పాఠశాలల నష్టాలను వివరాలతో ఇవ్వాలన్నారు.  జిల్లాలో అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీలకు సూచనలిచ్చారు.