01-11-2025 12:00:00 AM
ఆదిలాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేర కు 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, దేశం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం 5కే రన్ ను ఏఎస్పీ జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా రన్ లో పాల్గొన్నారు. ఈమేరకు ఏఎస్పీ మాట్లాడుతూ దేశ ఐక్యత శక్తి , సమగ్రతను కాపాడే కర్తవ్యాన్ని మరోసారి నిబద్ధతతో కొనసాగించేందుకు పోలీ సు వ్యవస్థ తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించిందని, ప్రజలు ఐక్యత శక్తిని విశ్వసించి, శాంతియుత సమాజాన్ని నిలబెట్టడంలో పోలీసులకు సహకరించాలని కోరా రు.
దేశ సమగ్రత ఐక్యతను, కాపాడడానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ జయంతి ని జాతీ య సమైక్యత దినోత్సవం పేరుతో నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ సమగ్ర తను కాపాడడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన వంతు కృషి చేస్తూ స్వాతంత్ర భారతదేశాన్నీ ఒక్కతాటిపై తీసుకువచ్చి భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. పోలీసు వ్యవస్థ సైతం స్వాతంత్ర భారతదేశాన్ని శాంతిభద్రతల పరిరక్షణలో కాపాడుతూ నిరంతరం ప్రజాసేవ లో పాల్గొంటుందని తెలిపారు.
విజేతలుగా నిలిచిన మొదటి 20 మంది పురుషులకు, ఐదుగురు మహిళలకు ప్రశంసా పత్రాలను అం దజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్. జీవన్ రెడ్డి, ఇంద్ర వర్ధన్, డివైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్, పట్టణ సిఐలు రిజర్వు ఇన్స్పెక్టర్లు రిజర్వు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.