calender_icon.png 1 November, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల స్థితిగతులు పొందుపరచాలి

01-11-2025 05:30:52 PM

తాడ్వాయి (విజయక్రాంతి): పాఠశాల స్థితిగతులు పూర్తిస్థాయిలో యుడైస్ పారాలలో పొందుపరచాలని తాడువాయి ఎంఈఓ రామస్వామి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో శనివారం ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వం సూచించిన సూచనలు గమనించి యుడైస్ పారాలలో తప్పులు లేకుండా ఇచ్చిన అంశాలకు సరైన విషయాలు నింపాలని సూచించారు. పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతులు, విద్యార్థుల స్థితిగతులు, ఫర్నిచర్ పాఠశాల తరగతి గదుల స్వభావం తదితర విషయాలు పూర్తిస్థాయిలో పొందుపరచలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి, కళ్యాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.