calender_icon.png 1 November, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వాములకు అన్నదానాలు పుణ్యకార్యాలు

01-11-2025 05:23:02 PM

ఆధ్యాత్మికతకు ప్రతీక కార్తీకమాసం..

గోపిరెడ్డినగర్ లోని రావెళ్ల కృష్ణారావు నివాసంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం..

కోదాడ: అయ్యప్ప స్వాములకు అన్నదానాలు పుణ్యకార్యాలు అనీ కోదాడ కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణా రావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని గోపిరెడ్డినగర్ లో వారి నివాసంలో కృష్ణా రావు దంపతులు అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రావెళ్ల కృష్ణారావు మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రతీక కార్తీక మాసం అన్నారు. అయ్యప్ప మాలధారణలతో ఆధ్యాత్మికత, ఆరోగ్యం, సత్ప్రవర్తన కలుగుతుందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అయ్యప్ప స్వామి దీవెనలతో స్వాములందరి దీక్షలు విజయవంతం కావాలన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన సహకారం వుంటుందన్నారు. కాగా కృష్ణారావు దంపతులు స్వాములకు పండ్లు ఫలాలు అందజేసి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు స్వాములు ఉన్నారు.