01-11-2025 05:37:05 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): సారస్వతీ నగర్‌లోని స్టార్ కిడ్స్ ప్రీ స్కూల్ ఆధ్వర్యంలో రెడ్ కలర్ డే వేడుకలు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించబడ్డాయి. చిన్నారులు అందరూ ఎరుపు రంగు దుస్తుల్లో ముద్దుగా, ఆకర్షణీయంగా మెరిసిపోయారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం ఎరుపు రంగుతో అలరారింది. పిల్లలు రెడ్ కలర్‌కు సంబంధించిన వస్తువులు, బొమ్మలు ప్రదర్శించి ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. రెడ్ కలర్ ప్రాధాన్యం, దాని అందం, ఉత్సాహం గురించి పిల్లలకు వివరిస్తూ ప్రిన్సిపాల్ మాట్లాడారు. చివరగా పిల్లలు పాటలు పాడి, చిన్న చిన్న గేమ్స్ ఆడి కార్యక్రమాన్నిఆనందోత్సాహాలతో ముగించారు.